అవన్నీఒట్టి రూమర్సే : రాశీఖన్నా

Rashi Khanna

“ఫలానా వారికోసం నేను ఇది చేశా.. అది చేశా.. అని డబ్బా కొట్టుకోవడం నాకు నచ్చదు. నిజంగానే నేను రెమ్యూనరేషన్‌ విషయంలో క్లారిటీగా ఉంటా. అలాగని చెత్త క్యారెక్టర్‌ ఇచ్చి డబ్బు ఆశ చూపితే.. అంగీకరించను” అని అంటోంది బ్యూటీ రాశీఖన్నా.  

Raashi Khanna

ఆశ్చర్యపోకండి.. ఈ మధ్య రాశీఖన్నా ఎక్కడపడితే అక్కడ, ఎవరు తారసపడితే వారితో బోల్డు కబుర్లు అడగకుండానే చెప్పుకొస్తుందట. అవును.. నిజంగా నిజం! నమ్మండి. ఆమె సన్నిహితులు కూడా రాశీఖన్నాకంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారట. ఈ విషయం గురించి  రాశీఖన్నాను వివరంగా అడిగితే.. కాస్సేపు నవ్వుతూనే విషయంలోకి వచ్చింది.  ” మీరు అనుకున్నట్టు .. ఎవరో అనుకుంటున్నట్టు వస్తున్నవన్నీ ఒట్టి రూమర్సే! నేను రెమ్యూనరేషన్‌ విషయంలో క్లారిటీగా ఉంటా. మంచి పాత్ర లభించి, అది కష్టంగా ఉంటుందనిపిస్తే.. పారితోషికం విషయంలో కాస్త డిమాండ్‌గా ఉంటా. ఎందుకంటే  నటన అంత సులభమూ కాదు. చెమటోడ్చి పని చేసినప్పుడు.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కాల్సిందే” అని అంటోంది‌.

సినిమా ఛారిటీ కాదు. పక్కా వ్యాపారం..అని అందరికీ తెలుసు. హీరో నుంచి టెక్నీషియన్ల వరకూ ఎవరూ తమ పారితోషికం తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అలాగని  రాశీఖన్నా ఛారిటీలకు దూరం అనుకుంటే పొరపాటే. పారితోషికం చేతిలో పడ్డాక ఆమె ఎక్కువగా ఖర్చు చేసేది సేవా కార్యక్రమాలకేనట. కానీ ఇవేమీ రాశీఖన్నా బయటకు తెలియనివ్వదు. మనం చేసే పని అవసరార్థులకు ఉపయోగపడితే చాలు అన్నది ఆమె సిద్ధాంతమట!?