Home News విహార యాత్ర‌కు బ‌య‌లు దేరిన మ‌రో క్రేజీ క‌పుల్‌... వీరి ప్ర‌యాణం ఎక్క‌డికో?

విహార యాత్ర‌కు బ‌య‌లు దేరిన మ‌రో క్రేజీ క‌పుల్‌… వీరి ప్ర‌యాణం ఎక్క‌డికో?

ఎప్పుడు స‌రదాలు, సంతోషాల మ‌ధ్య హాయిగా ఉండే సెల‌బ్రిటీల‌కు క‌రోనా మ‌హమ్మారి పెద్ద అడ్డుక‌ట్ట వేసింది. క‌రోనాని అరిక‌ట్టే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో దాదాపు ఎనిమిది నెల‌ల పాటు అంతా ఇంటికి ప‌రిమిత‌మ‌య్యారు. ప‌క్క జిల్లాకు వెళ్ళేందుకు కూడా భ‌య‌ప‌డ్డారు. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ కాస్త త‌గ్గుతున్న నేప‌థ్యంలో విహార‌యాత్ర‌ల‌కు ప‌య‌నం అవుతున్నారు. గ‌త ఏడాది పెళ్లి పీట‌లెక్కిన కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌లు త‌మ భ‌ర్త‌ల‌తో మాల్దీవుల‌కు వెళ్ళారు. నిఖిల్, నితిన్‌లు కూడా టూర్స్ వేశారు.

Rana Miji | Telugu Rajyam

మ‌హేష్ బాబు ఫ్యామిలీ అయితే కొద్ది గ్యాప్‌లోనే రెండు సార్లు దుబాయ్ వెళ్ళారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ, స‌మంత ఫ్యామిలీ కూడా విహార‌యాత్ర‌కు వెళ్లారు. ఇక ఇప్పుడు ద‌గ్గుబాటి రానా ఫ్యామిలీ వంతు వ‌చ్చింది. క‌రోనా టైంలోనే పెళ్లి కావడం, హనీమూన్‌కు వెళ‌దామంటే క‌రోనా వ‌ల‌న ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంబించ‌డంతో ఆ ప్లాన్ ను ర‌ద్దు చేసుకున్నారు.అయితే మిహీక పుట్టిన రోజు వేడుక‌ల‌కు మాత్రం ఆమెను ఏదో స‌ర్‌ప్రైజింగ్ ప్లేస్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ వారిరివురు దిగిన ఫొటోని మిహికా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

తాజాగా రానా-మిహికా జంట శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఈ జంట విహార యాత్ర‌కు వెళుతున్నారా, లేదంటే టూర్ పూర్తి చేసుకొని వ‌స్తున్నారా అనేది స‌స్పెన్స్‌గా మారింది. ఈ క్యూట్ క‌పుల్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారగా, ఇవి చూసిన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా, రానా-మిహీక వివాహం ఆగస్టు 8 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరగ‌గా, ఈ ఆత్మీయ వివాహానికి వెంకటేష్ దగ్గుబాటి- సమంత- నాగ చైతన్య సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం రానా విరాట ప‌ర్వం. అర‌ణ్య‌తో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. 

- Advertisement -

Related Posts

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

వలసదారులకి గుడ్ న్యూస్ చెప్పిన జో బైడెన్ .. ఏమిటంటే ?

అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేకానేక వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో...

Latest News