Ramarao On Duty : అణువణువునా ఆయుధమే! రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్

  Ramarao On Duty : మాస్ మహారాజా  రవితేజ ఖిలాడీ తో బోల్తా కొట్టాక రామారావు ఆన్ డ్యూటీ తో వచ్చేస్తున్నాడు… రవితేజ సినిమాల స్పీడు చూస్తూంటే ప్రేక్షకుల వూపిరి ఆడడం లేదు. ఈసారి పవర్ఫుల్ కలెక్టర్ పాత్రలో రామారావు ఆన్ డ్యూటీ తో వస్తున్నాడు. గతంలో రెండు పోస్టర్లు రిలీజ్ చేశాక ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. టీజర్ రవితేజ క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా వుంది- ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో వుంటుంది… ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా వుంటుంది‘ అన్న డైలాగ్ తో రవితేజ  హైలైట్ అయ్యాడు.

   నిజాయితీగల, ప్రజల సమస్యలు తీర్చే కలెక్టర్ గా రవితేజ తనని అడ్డుకున్న ప్రత్యర్ధుల అంతు చూసే సన్నివేశాలు టీజర్ లో వున్నాయి. ఇసుక మాఫియాతో పోరాటం, నక్సల్ నేపథ్యం కొంత వున్నాయి. యాక్షన్ సీన్స్ హైలైట్స్ గా వున్నాయి. రవితేజ సరసన దివ్యాంశా కౌషిక్రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఓ పాత్రలో టీజర్ లో కన్పిస్తాడు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్ కనిపించనున్నారు.

     ఛాయాగ్రాహకుడు సత్యన్ సూర్యన్ విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి.  శ్యామ్ సిఎస్ సంగీతం యాక్షన్ ని ఎలివేట్  చేసేలా వుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి దీమికి నిర్మాత. ఈ సినిమాతో ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. మండవ శరత్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. 

Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri