నటీనటులు: అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, నుష్రత్ భరుచ్చా, నాజర్
దర్శకత్వం : అభిషేక్ శర్మ
నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో
సంగీతం: డేనియల్ బి జార్జ్
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. సౌత్ సినిమా అంటే చాలా చిన్న చూపుడు ఉండేది. ఈ విషయం ఒక సందర్భంలో చిరంజీవి కూడా చెప్పాడు. అయితే గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నుండి ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా రావట్లేదు. అక్కడ కూడా సౌత్ సినిమాలే సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఒక టైం లో ఖాన్స్ ని డామినేట్ చేసి వరుస హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్ ఇప్పుడు హిట్స్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు రామ్ సేతు అనే అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందొ చూడం.
కథ:
ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్) ఒక ఫేమస్ ఆర్కియాలజిస్ట్, తన తెలివి, హార్డవర్క్ కారణంగా పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోట్ అవుతాడు. మరో పక్క ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని అనుకుంటాడు. కానీ అది జరగాలంటే, ఇంద్రకాంత్ రామసేతు సహజ నిర్మాణమని నిరూపించే శాస్త్రీయ అనుమతిని పొందాలి. అందువల్ల రామసేతు సహజంగా ఏర్పడిందా ?, లేదా మానవ నిర్మితమా అని తేల్చే పనిని ఆర్యన్‌కు అప్పగిస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటీ ?, ఈ ప్రాసెస్ లో ఆర్యన్ అండ్ టీం ఏం కనిపెట్టింది ?, ఆఖరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రామ్ సేతు ని శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని హిందువులు నమ్ముతారు. ఈ ఆలోచనతో వచ్చిన ఈ చిత్రంలో రామ సేతు గురించి చెప్పిన, చూపించిన కొన్ని అంశాలు చాలా బాగున్నాయి. అక్షయ్ కుమార్ ఇంకోసారి ఆర్కియాలజిస్ట్‌గా చాలా బాగా నటించాడు.
అక్షయ్ కుమార్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు సత్యదేవ్ కూడా చాలా బాగా నటించారు. మూవీ సెకండాఫ్‌లో కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా దర్శకుడు భారతీయ చలనచిత్రంలోనే టచ్ చేయని ఒక యూనిక్ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. కానీ ఎంటరైనింగ్ కథనం రాయడంలో విజయం సాధించలేకపోయారు. మూవీ సినిమా చాలా వరకు ఫ్లాట్‌గా సాగుతుంది. సినిమాలో మరో పెద్ద లోపం VFX. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. కానీ, ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు.
తీర్పు :
సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆకట్టుకునే విధంగా సాగింది. నటీనటులు బాగా నటించినా కూడా గ్రిప్పింగ్ లేని సీన్స్, నీరసంగా సాగే స్క్రీన్‌ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ వల్ల ఈ సినిమా ఆకట్టుకోలేకపోతుంది.