Akshay Kumar: కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని.. చేతులు జోడించి ప్రార్థించిన అక్షయ్ కుమార్.. వీడియో వైరల్!

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి భారీగానే సంపాదించారు. ఇకపోతే అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం హౌస్ ఫుల్ 5. ఇది ఈ కామెడీ ఎంటర్టైనర్ సిరీస్ లో వస్తున్న ఐదవ సినిమా కావడం విశేషం.

ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే పూణేలో ఒక మాల్ లో ఈవెంట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే ఊహించని విధంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ వేదికపై మాట్లాడుతుండగా తోపులాట జరిగింది. ‍అభిమానులు తోసుకోవడంతో ఒక మహిళ ఇబ్బంది పడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది చూసిన అక్షయ్ కుమార్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు.. దయచేసి ఎవరూ కూడా తోసుకోవద్దు అంటూ అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ తర్వాత ఏడుస్తున్న ఆ మహిళ అభిమానిని హీరోయిన్లు బజ్వా, ఫెర్నాండెజ్ కౌగిలించుకుని ఓదార్చారు. కాగా ఈ సినిమా జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఆ వీడియో వైరల్ కావడంతో అభిమానులు స్పందిస్తూ ఆ మహిళ బాధ అర్థం చేసుకొని అక్షయ్ కుమార్ వెంటనే చాలా చక్కగా స్పందించారు లేదంటే ఆ తోపులాట వల్ల ఇబ్బంది జరిగి ఉండేది అంటూ కొంతమంది అక్షయ్ కుమార్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.