Ram Rao On Duty : రామారావు ఆన్ డ్యూటీ: రవితేజకి ఏమయ్యింది చెప్మా.?

Ram Rao On Duty : రవితేజ అంటేనే ఎనర్జీ.. కానీ, ఆ ఎనర్జీ ఏదీ.? ఎక్కడ.? ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రోమో రావడంతో రవితేజ అభిమానులే నిరాశ చెందారు. రవితేజ సినిమాల్లో వుండాల్సిన పవర్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. పైగా, నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీష్’ సినిమాని తలపిస్తోంది ‘రామారావు ఆన్ డ్యూటీ’.

హట్టూ.. ఫట్టూ.. అన్న సంబంధమే లేకుండా రవితేజ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మధ్యలో ‘క్రాక్’ సినిమా వచ్చి వుండకపోతే, రవితేజ మార్కెట్ చాలా దారుణంగా వుండి వుండేదే. ‘క్రాక్’తో వచ్చిన మార్కెట్టు కాస్తా, ‘ఖిలాడీ’ సినిమాతో రవితేజ పోగొట్టుకున్నాడన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

సరిగ్గా ఈ తరుణంలోనే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రోమో వచ్చింది. ప్రోమోనే ఇంత నీరసంగా వుంటే, సినిమాలో సీన్ ఇంకేముంటుంది.? అన్నది రవితేజ అభిమానుల్లోనే జరుగుతోన్న చర్చ. ‘అబ్బే, ప్రోమో అదిరిపోయింది..’ అంటూ ప్రమోషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఊదరగొట్టేయొచ్చుగాక.

కానీ, రవితేజ మారాల్సిన సమయం ఆసన్నమైంది.. కాదు కాదు, ఆ సమయం కూడా ఎప్పుడో దాటేసింది. తెరపై హీరోయిన్లేమో చాలా చాలా యంగ్.. రవితేజ ఏజ్ బాగా కనిపించేస్తోంది. ఈ నేపథ్యంలో వయసుకు తగ్గ పాత్రలు రవితేజ చేస్తే మంచిది. రవితేజ చాలా మంచి నటుడు.. కానీ, మూస పాత్రలకు పరిమితవడమే ఒకింత బాధాకరం.