Gallery

Home News ట్రిపుల్ ఆర్‌లో రామ్‌.. ఆస‌క్తిగా గమ‌నిస్తున్న అభిమానులు

ట్రిపుల్ ఆర్‌లో రామ్‌.. ఆస‌క్తిగా గమ‌నిస్తున్న అభిమానులు

హెడ్డింగ్ చ‌దివి కాస్త క‌న్ఫ్యూజ్ అయి ఉంటారు క‌దా! రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. మరి ఇలాంటి సంద‌ర్భంలో ట్రిపుల్ ఆర్‌లో రామ్ న‌టించ‌డ‌మేంట‌నే క‌న్ఫ్యూజ్ ఏర్ప‌డింది క‌దా.. ! అస‌లు విష‌యం ఏంటంటే ఇటీవ‌ల రెడ్ చిత్రంలో ద్విపాత్రాభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన రామ్ త్రిపాత్రిభిన‌యం చేయ‌బోతున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Raam | Telugu Rajyam
రెడ్ చిత్రంలో రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల మెప్పు పొందిన రామ్ త‌న త‌ర్వాతి చిత్రంలో మూడు గెట‌ప్స్‌లో క‌నిపిస్తాడ‌ట‌. అంటే ‘రామ్‌ రామ్‌ రామ్‌’ (ట్రిపుల్‌ ఆర్‌) ముగ్గురు రామ్‌లని ఒకే స్క్రీన్‌ మీద చూసే అవ‌కాశం అభిమానుల‌కు ద‌క్క‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్. పర్‌ఫార్మెన్స్ పరంగా కాని, డ్యాన్స్ ప‌రంగా కాని చూసుకుంటే ప్ర‌తి సినిమాలోను ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రామ్ త్రిపాత్రాభిన‌యంలో సినిమా చేయాల‌ని ఓ ద‌ర్శ‌కుడు సంప్ర‌దించిన‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో జూనియ‌ర్ ఎన్టీఆర్..జై ల‌వ‌కుశ సినిమా కోసం మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించాడు.

ఇప్పుడు రామ్ కూడా త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు రావ‌డం , నందమూరి ఫ్యామిలీ హీరో క‌ళ్యాణ్ రామ్ కూడా త్రిపాత్రాభినయం చేసేందుకు రెడీ అయినట్లుగా వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొద‌ల‌వుతుందా ఏంటి అని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత రామ్ రెడ్ అనే చిత్రాన్ని చేయ‌గా, ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇప్పుడు శివ మాల ధ‌రించిన రామ్ కొద్ది రోజ‌లపాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చాడు. మాలధార‌ణ పూర్త‌య్యాక త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనో లేదంటే ఇత‌ర ద‌ర్శ‌కుల‌తోనో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News