ఇన్సైడ్ టాక్ : ఊహించని సెన్సేషనల్ కాంబో సెట్ చేస్తున్న రామ్ చరణ్.?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర క్రేజ్ తెచ్చుకుంటున్న టాలీవుడ్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి రామ్ చరణ్ అయితే నేషనల్ వైడ్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఇప్పుడు వస్తుండగా రామ్ చరణ్ నెక్స్ట్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు.

దీనిపై కూడా అనేక ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఉన్నాడు. ఇక దీని తర్వాత అయితే తన కెరీర్ లో 16వ సినిమాగా గౌతమ్ తో చేయాల్సి ఉంది కానీ అది లాస్ట్ మినిట్ లో సెట్టవ్వలేదు. మరి ఇప్పుడు అయితే సెన్సేషనల్ అప్డేట్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది.

రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర పెద్ద ఎత్తున వినిపిస్తున్న చిత్రం “కాంతారా” కోసం తెలిసిందే. మరి ఈ సినిమాని తీసిన హీరో అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి రామ్ చరణ్ కోసం ఓ అదిరే కథని రెడీ చేసాడట. మరి దీనిని రామ్ చరణ్ ఇపుడు జపాన్ నుంచి తిరిగి వచ్చాక చెప్పనున్నాడని ఇన్సైడ్ టాక్.

ఒకవేళ ఇది కానీ సెట్టయితే కన్నడ దర్శకుల సినిమాలు ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటున్నాయో చూస్తున్నాము ఇక ఈ కాంబినేషన్ కానీ సెట్టయితే ఇది ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.