సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డు సెట్ చేసిన మెగాపవర్.!

తెలుగు సినిమా దగ్గర అయితే మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోస్ లో మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. అయితే రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ లెగసి ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా తీసుకెళ్తు భలే క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. మరి వినూత్న సినిమాలతో గ్లోబల్ గా రీచ్ అందుకున్న మెగా పవర్ స్టార్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డు ని అయ్యితే అందుకున్నాడు.

తాను చాలా లేట్ గానే సోషల్ మీడియాలో అయితే అడుగు పెట్టాడు. మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ లాంటి హీరోల కన్నా లేట్ గానే అడుగు పెట్టినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం చరణ్ కి గట్టిగా వచ్చింది. జస్ట్ రెండేళ్లలోనే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఏకంగా 90 లక్షల మంది ఫాలోవర్స్ ని తాను సంపాదించుకోవడం విశేషంగా మారింది.

దీనితో టాలీవుడ్ సినిమా నుంచే కాకుండా సౌత్ ఇండియా సినిమా నుంచి కూడా అతి తక్కువ సమయంలో ఈ భారీ రికార్డు అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ అయితే రికార్డు నెలకొల్పాడు. ఇక ప్రస్తుతం అయితే చరణ్ శంకర్ సినిమాలో కీలక షెడ్యూల్ ని ముగించి తన RRR సినిమా ప్రమోషన్స్ నిమిత్తం భార్య ఉపాసనతో కలిసి జపాన్ కి పయనం అయ్యాడు. 
https://www.instagram.com/alwaysramcharan/