వైరల్ : జపాన్ అమ్మాయిల్లో చరణ్ క్రేజ్ మాములుగా లేదే..!

పాన్ ఇండియా మార్కెట్ లోనే కాకుండా పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా భారీ స్థాయి లో సెన్సేషన్ ని నమోదు చేసిన మన ఇండియన్ సినిమా అందులోని తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR). ఇద్దరు తొళువూడ్ బిగ్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం అనేక రికార్డులు సొంతం చేసుకుంది.

మరి ఈ సినిమా ఇప్పుడు జపాన్ దేశంలో భారీ మొత్తంలో స్క్రీన్స్ లో రేపు అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుండగా అక్కడికి నిన్ననే ఇద్దరు హీరోలు సహా దర్శకుడు రాజమౌళి కూడా వచ్చాడు. మరి జపాన్ లో ముందే ఎన్టీఆర్ మరియు రాజమౌళి లకు భారీ క్రేజ్ ఉంది కానీ ఈరోజు అక్కడ అయితే రామ్ చరణ్ కి అక్కడి జపాన్ అమ్మాయిలు చాలా ఎగ్జైట్ అవుతూ తనతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపించారు.

పక్కనే ఎన్టీఆర్ ఉన్నా కూడా రామ్ చరణ్ తో ఆ గర్ల్స్ చరణ్ తో మాట్లాడుతూ ఉండడం విశేషం. మరి అప్పుడు రామ్ చరణ్ నే మరో అమ్మాయికి ఎన్టీఆర్ దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకో అంటే అతని దగ్గర అప్పుడు తీసుకుంది. దీనితో ఇప్పుడు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ కి అక్కడ మేల్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటే రామ్ చరణ్ కి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉందని క్లియర్ అవుతుంది.