Ram Charan and Jr NTR : కనీ వినీ ఎరుగని రీతిలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్ర్కీన్‌పై చూపించే ప్రయత్నం చేశాడు జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు.. మరెన్నో అడ్డంకులు. మొదట్లో ఇది అసలు పట్టాలెక్కే ప్రాజెక్టే కాదని అంతా లైట్ తీసుకున్నారు.
కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు జక్కన్న రాజమౌళి.
కరోనా లాంటి అనూహ్య ఆటంకాలు వచ్చి వుండకపోతే, ఇంకా ముందే ఈ అద్భుత దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండేది. అయితేనేం, ఎట్టకేలకు బొమ్మ పడింది.
అద్భుతం, మహా అద్భుతం.. రాజమౌళి నుంచి వచ్చిన మరో విజువల్ వండర్. నో డౌట్.. అనే రెస్పాన్స్ వస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆడియన్స్ నుండి. అయితే, ఇద్దరు స్టార్ హీరోలను ఈక్వెల్‌గా మ్యానేజ్ చేయడమనే ప్రక్రియ ఏదైతే వుందో అందులో రాజమౌళి సక్సెస్ అయ్యాడా.?
ఎన్టీయార్‌కి ఎక్కువ స్కోప్ వున్న పాత్ర దక్కిందంటూ కొన్ని వర్గాల అభిప్రాయం. కానీ, చరణ్ తనకున్న నిడివిలో సినిమా మొత్తానికి తానే సోలో హీరో అనేంతలా ఎన్టీయార్‌ని డామినేట్ చేశాడంటూ సినిమా చూసిన ఇంకొందరి అభిప్రాయం.
ఎన్టీయార్ పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చేందుకు చరణ్ పాత్రను తగ్గించేశాడంటూ, సోషల్ మీడియా వేదికగా మరో వర్గం జక్కన్నను తిట్టడం మొదలెట్టేశారు కూడా.
ఏది ఏమైనప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓ అద్భుత దృశ్య కావ్యం.. తెలుగు సినిమా హిస్టరీని తిరగరాసే చిత్రం అనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదనేది సినిమా చూసిన వాళ్లలో మెజార్టీ పీపుల్ నుంచి వస్తున్న మాట.