Rajinikanth: రజినీకాంత్ కొత్త సినిమా ఆ దర్శకుడితోనే.. 28 ఏళ్ల తర్వాత జోడీ కుదిరేనా?

Rajinikanth: తమిళ తలైవా రజినీకాంత్ తాజాగా అన్నాత్తే అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని తెలుగులో పెద్దన్న టైటిల్ తో విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైనప్పటికీ నెగిటివ్ టాక్ సంపాదించుకోలేకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపించిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ఏ విధమైనటువంటి సినిమాలను ప్రకటించకుండా ప్రస్తుతం కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజు, వెంకట్‌ ప్రభు, కేఎస్‌ రవికుమార్‌ వంటి దర్శకులు రజనీకి కథలు చెప్పారని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా మరొక డైరెక్టర్ ఆర్‌. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ‘చీనీ కమ్‌’, ‘పా’, ‘ప్యాడ్‌మాన్‌’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న
ఆర్‌. బాల్కీ రజినీకి మరొక ఈ కథను చెప్పారని ఆ కథ విన్న రజనీకాంత్ ఈ సినిమాలో నటించడానికి సానుకూలంగా ఉన్నారంటూ సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆర్‌. బాల్కీ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ సంగీత దర్శకుడు ఇళయరాజా పనిచేశారు.

ఈ క్రమంలోనే రజనీకాంత్ ఆర్‌. బాల్కీ కాంబినేషన్లో సినిమా వస్తే ఈ సినిమాకి కూడా 90 శాతం ఇళయరాజా సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇళయరాజా రజినీకాంత్ నటించిన 1994 వీర అనే చిత్రానికి సంగీతం అందించారు. ఇలా దాదాపు 28 సంవత్సరాల తర్వాత మరోసారి ఇళయరాజా రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా తెరపై వినపడుతోంది. మరి 28 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ కుదురుతుందా? లేదా అనే విషయం తెలియాలంటే ఈ విషయం పై అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.