సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై అదిగో పులి ఇదిగో తోక అన్నట్లు ప్రచారం తప్ప! ఇప్పటివరకూ ఎంట్రీ ఇచ్చింది లేదు…పార్టీ స్థాపించింది లేదు. ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని ఎంత ఒత్తిడి చేసినా రజనీ ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. బ్యాకెండ్ ఉంటూనే తను చేయాలనుకున్నది సలహాల రూపంలో కమల్ హాసన్ లాంటి వారికి ఇస్తున్నారు. ఆయనకు తన మద్దతు ఎప్పడూ ఉంటుందని రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా పార్టీ నేతలతోనూ రజనీ సన్నిహితంగా మెలగడం వంటి సన్నివేశాలు అభిమానుల్ని డిఫెన్స్ లో్ పడేసాయి.
ఈ నేపథ్యంలో తాజాగా రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయనతో సన్నిహితంగా ఉండే చెన్నై నగరం డిప్యూటీ మేయర్ తియగరాజన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 2020లోనే రజనీకాంత్ పార్టీ స్థాపించబోతున్నట్లు ఆయన వెల్లడించడం విశేషం. మార్చి 12వ తేదీన పార్టీ ప్రారిభించాలని రజనీ ప్లాన్ చేసుకున్నారుట. కానీ ఇంతలో దేశంలోకి కరోనా రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు కల్లా వైరస్ అదుపులోకి వస్తే ఆ నెలలో పార్టీ ప్రకటించాలను కున్నారుట. కానీ ఇంకా దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో ఆ నిర్ణయం కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కాబట్టి నవంబర్ వరకూ పార్టీ ఆలోచన లేనట్లేనని తెలిపారు. ఈలోపు వైరస్ అదుపులోకి వస్తే నవంబర్ లోనే పార్టీ ప్రకటించే అవకాశం ఉందని తియగరాజన్ తెలిపారు. వచ్చే ఏడాది కల్లా తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నందునే ఈ లోపే రజనీకాంత్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. అందుకు కావాల్సిన విధి విధానాలు రూపొదించే పనుల్లో రజనీ సన్నిహిత వర్గాలు ఇప్పటికే బిజీ అయ్యాయని తెలిపారు.