Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తమిళనాడులో స్థాపించడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా ఈయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయి. ఎన్డీయే కూటమి సభ్యుడిగా దక్షిణాదికి సీట్లు కచ్చితంగా తగ్గవు. విభజన రేఖలు లేకుండా భారతదేశం మరింత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పునర్విభజన జరగలేదు, దానిపై గోడవ చేయడం వల్ల ప్రయోజం ఏమీ ఉండదు. దక్షిణాది సీట్లు తగ్గకూడదు, నేను అదే కోరుకుంటాను. నేను ఎప్పుడూ మాట మార్చలేదు. బలవంతంగా ఏ భాషను రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను. హిందీ మాత్రమే నేర్చుకోవాలని ఎవరు చెప్పలేరు చెప్పకూడదని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక అన్ని అనుకూలిస్తే తాను తమిళనాడులో కూడా జనసేన పార్టీని పెడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో ఆడుగుపెడుతుంది. ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ రెస్టారెంట్ ను మూసేయలేదు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేనటువంటి స్టాలిన్ ఉదార స్వభావాన్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందేనని ఈయన తెలిపారు.
మనం పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యం అని పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంతా ఈజీ కాదని, అది కేవలం ఎన్ఠీఆర్ గారికి మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇలా ఈయన తమిళనాడులో జనసేన పార్టీని స్థాపించడం గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.