Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకు మొదటిసారి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. 2024 ఎన్నికలలో భాగంగా ఈయన పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశారు అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా విజయం సాధించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంత్రిగా మాత్రమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కేవలం ఏపీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.. ఇలాంటి తరుణంలోనే ఈయన తన పార్టీని కేవలం ఆంధ్రకు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పరిమితం చేయాలని భావిస్తున్నారు. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. ఇలా ఈ వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.
పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడుకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇలా ఈ చర్చల అనంతరం తమిళనాడుకు చెందిన పలువురు నేతలు తమిళనాడులో కూడా జనసేన పార్టీని స్థాపించాలని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.
ఇలా తమిళనాడులో పార్టీ ఏర్పాటు చేయడం గురించి కూడా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చాలా సున్నితంగా తిరస్కరించాలని తెలుస్తుంది. ప్రస్తుతం తాను ఏపీపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టానని తెలిపారు.ఇక్కడ గత ఐదేళ్లలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రోడ్లు కూడా వేయకుండా గత ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని.. చెప్పుకొచ్చారు. ఇక పొత్తు గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కడుతున్నారని.. ఆయన మహారాష్ట్ర, ఏపీ సహా పలు రాష్ట్రాలను ఉదహరించారు. కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. జవాబుదారీ తనం పెరుగుతుందని, ప్రజలు కూడా ఈ విషయాన్ని చాలా బలంగా నమ్ముతున్నారని తెలిపారు. బలమైన పార్టీలకు పట్టం కడితే అభివృద్ధి కూడా జరుగుతుందని అందుకు నిదర్శనమే ఆంధ్ర ప్రదేశ్ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.