AP: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి పొత్తు ఏర్పరచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇలాంటి పరిస్థితులలో ఏపీలో ఇతర పార్టీలు పుంజుకోవడం అనేది కాస్త కఠినతరమైన అంశం అని చెప్పాలి.. ఇలాంటి తరుణంలోనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు వైసీపీ పార్టీ ఏపీలో తిరిగి తమ స్థానాలను దక్కించుకోవడం కోసం కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది ఎంతోమంది పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు ఇలాంటి తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సరికొత్త వ్యూహం రచించారని తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న ఇతర నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే విధంగా రాహుల్ గాంధీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది . దీనికోసం షర్మిల రంగంలోకి దిగారు. వైసీపీ నుంచి బయటకు రాబోతున్న కొంతమంది కీలక నేతలతో షర్మిల భేటీ అవుతూ వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో బలహీనంగా ఉన్న నాయకత్వాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి.. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం చేపడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికైనా ఆంధ్రాలో కూడా. తమ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తోది.