ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ.. నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ నేతలు!

గత కొన్ని రోజుల నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పేర్లు బాగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీకి కోవిడ్ సోకడంతో రాహుల్ గాంధీ తాజాగా ఈడీ ముందు హాజరయ్యారు. దీంతో ఆయనను ఇద్దరు అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది.

ఇక ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపడుతున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కార్యాలయం వరకు ర్యాలీ ప్రారంభించి నిరసన చేపట్టారు. ఇక ఆ కార్యాలయం వద్ద పోలీసులు బృందం చేరుకున్నారు. పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రస్తుతం ఈడీ అధికారులు ఇంకా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.