తుఫాన్ వచ్చే ముందు వాతావరణం నిశబ్ధంగా ప్రశాంతంగా ఉంటుంది. సునామీ వచ్చే ముందు కూడా అలాగే ఉంటుంది. భూకంపా లు సంభవించే ముందు కూడా ఇలాంటి వెదరే అలుము కుంటుంది .ఇవన్నీ ప్రకృతి విపత్తులు. వాటిని ఆపడం ఎవరి వల్ల కాదు. వాటికవి అగాలి లేదా! ఆ పై వాడు దిగొచ్చి ఆపితే తప్ప మరొకరు ఆపితే ఆగేవి కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? అయితే అసలు సంగతిలోకి వెళ్లాల్సిందే. జగన్ అనే తుఫాన్ ముందు, సునామీ ముందు, భూకంపం ముందు వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కొట్టుకుపోవడానికి రెడీగా ఉన్నట్లే రాజకీయ వాతావరణ పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
జగన్ తో రెబల్ ఎంపీ నువ్వా? నేనా? అన్నట్లు పోరాటం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ అనుచర గణం మొదట్లో గట్టిగానే రఘురామ ఆరోపణల్ని తిప్పి కొట్టినప్పటికీ ఇప్పుడంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రఘురామ ఏమన్నా! వైకాపా ముఖ్యనేతలు గానీ, జగన్ మంత్రి వర్గం గానీ మిగతా ఎవ్వరూ కూడా పట్టిపట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రఘురామకి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసుకోండి..విమర్శలు చేసుకోండి అంతా మీ ఇష్టం. మాకెలాంటి అభ్యంతరం లేదన్నట్లు వదిలేసారు. మరి ఇలా జగన్ మౌనం దాల్చడం వెనుక నయా పాచిక ఏంటి? అంటే దీని వెనుక పెద్ద సంగతే ఉన్నట్లు సంకేతాలందుతున్నాయి.
ఏపీలో బీజేపీ- వైకాపా వైఖరి చూస్తుంటే సింగం-2 లో `భాయ్-త్యాగరాజ్` నాటకంలా ఉందని ఓ సందేహం రాకమానదు. బీజేపీపైకి పుల్లవిరుపుడు మాటలు మాట్లాడినా వైకాపాకి లోలొపల మద్దతిస్తున్నట్లే కనిపిస్తోంది అనడానికి బీజేపీ కొత్త సారథి ఎంట్రీతో ఖారారైపోయింది. బీజేపీ టార్గెట్ టీడీపీని తప్పించి ఏపీలో రెండవ అతిపెద్ద పొలిటికల్ పార్టీగా అవతరించడానికి పావులు కదుపుతుంది అన్నది సుస్పష్టం. ఇక్కడే రఘురామకి పెద్ద పంచ్ పడినట్లు అయింది. ఇన్నాళ్లు కేంద్రం అండ చూసుకునే రఘురామ వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసారు. కానీ ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారాయి. రెండు పార్టీల వైఖరి చూస్తుంటే కొన్ని విషయాల్లో దోస్తానం తప్పని సరే అనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో రఘురామని బీజేపీ ఎందుకు వెనకేసు కొస్తుంది. జగన్ మౌనానికి ఎందుకు బుధులివ్వదు? ఈ నేపథ్యంలో రఘురామ పరిస్థితి ఏంటి? అంటే ఓ పాట గుర్తొస్తుంది. పుట్టింటోళ్లు తరిమేసారు..కట్టుకున్నోళ్లు వదిలేసారు అన్నట్లు. మరి అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలి.