‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ సినిమా హక్కులు ఇండియాలోనే కాదు తెలుగువారున్న ప్రతి చోటా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కూడ రికార్డ్ స్థాయి రేట్లకు అమ్ముడు కాగా ‘రాధేశ్యామ్’ కూడ అదే స్థాయిలో అమ్ముడుపోతోంది. ప్రభాస్ నుండి అందరూ యాక్షన్, అడ్వెంచరస్ సినిమాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా లవ్ స్టోరీ ఈ ‘రాధేశ్యామ్’ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రేమ కథ ఇక ఎత్తైతే విజువల్స్ ఇంకో ఎత్తు. దాదాలు సినిమాలో మేజర్ భాగాన్ని సెట్స్ వేసి షూట్ చేయడం జరిగింది.
ఫారిన్ లొకేషన్స్ అన్నీ సెట్ వర్క్ మీదనే జరిగాయి. ఈ చిత్రం కోసం దాదాపు 26 వేరు వేరు సెట్స్ నిర్మించారు. ఈ సెట్స్ నిర్మాణం కోసమే 100 కోట్లకు పైగా వెచ్చించారు. రైల్వే స్టేషన్, పెద్ద పెద్ద భవంతులు, అందమైన వీధులు ఇలా అంతా అథెన్టిక్ లుక్ ఉండేలా చూశారు. ఈ అందమైన విజువల్స్ సినిమా చూసే ప్రేక్షకులను వేరొక లోకంలోకి తీసుకెళతాయని అంటున్నారు టీమ్. ప్రభాస్ నమ్మకం కూడ అదే. ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని చేశారు. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రేమ కథలు చాలా వరకు హిట్ అయ్యాయి. ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. వాటిలానే ఈ సినిమా కూడ మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాడు ప్రభాస్.