‘RRR’ గ్లింప్స్ పై “రాధే శ్యామ్” దర్శకుడు రివ్యూ.!

నిన్ననే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “ట్రిపుల్ ఆర్(RRR)” నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యగా దానికి భారీ లెవెల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో పాటుగా వచ్చే ఏడాది ఇదే సంక్రాంతి రేస్ లో సిద్ధంగా ఉన్న మరో భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు RRR పై తన రివ్యూ చెప్పాడు. ఈ మ్యాజికల్ గ్లింప్స్ ఎలా ఉందో చెప్పడానికి తన దగ్గర మాటలు, వాక్యాలు చాలట్లేదని, అంతేకాకుండా జీనియస్ రాజమౌళి చూపించిన విజువల్స్, కీరవాణిల మ్యూజిక్ ఇందులో ఎక్స్ట్రార్డినరీ గా ఉన్నాయని, ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు చాలా ఆసక్తిగా చూస్తున్నాను అని రాధా కృష్ణ తెలిపాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.