ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఎప్పుడు విషం చిమ్ముతూ, లేనివి ఉన్నట్లు చెపుతూ, ప్రతి నిమిషం జగన్ కు వ్యతిరేకంగా పనిచేయటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు జ్యోతి అధినేత రాధాకృష్ణ. ఆయన నుండి ప్రతివారం వచ్చే పలుకులో జగన్ ని విమర్శించటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. దేశంలో, ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నకాని, వాటిమీద తన కలం పదును చూపించకుండా దానిని కేవలం జగన్ కోసమే వాడుతుంటాడు, అలాంటి రాధాకృష్ణ కలం నుండి ఈ వారం పలుకులో జగన్ కు అనుకూలంగా వార్త క్యారీ కావటం విశేషం.
మార్పు ఎందాకా..? అనే సబ్ టైటిల్ ఇస్తూ, “జగన్ మోహన్ రెడ్డి లో మార్పు వచ్చిందా అంటే, అవుననే తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేక లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపించిన కానీ పట్టించుకోని జగన్ ఈ మధ్య కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకోవటం, వాటిని సరిచేయటం జరుగుతుంది . వాస్తవ పరిస్థితికి తగ్గటలు జగన్ నిర్ణయం తీసుకుంటున్నాడు. వరద బాధితులకు 500 సహాయం అందించే క్రమంలో 7 రోజులు నీళ్లలో ఉన్నవాళ్ళకి మాత్రమే అంటూ జీవో విడుదల చేయటం దానిపై వ్యతిరేకత రావటంతో దానిని వెనక్కి తీసుకోవటం, భూ సర్వే కోసం హద్దుల్లో వేయటానికి ఉపయోగించే రాళ్ల మీద జగన్ బొమ్మ ఉండటం, దానిపై వ్యతిరేకత రావటంతో దిద్దుబాటు చర్యలు చెప్పట్టాడు. ఇవన్నీ కూడా జగన్ లో మార్పు వచ్చిందని చెప్పటానికి రుజువులు అంటూ” రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. తర్వాత లైన్స్ లో రాధాకృష్ణ ఎలాగూ జగన్ ను విమర్శిస్తాడు అది ఎలాగూ సహజమే.
అయితే పైన రాధాకృష్ణ చెప్పిన మాటలు గమనిస్తే జగన్ పాలనా ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అధికారానికి కొత్త కాబట్టి నిర్మాణాత్మకంగా తీసుకునే కొన్ని నిర్ణయాల్లో చిన్న చిన్న తప్పులు సహజమే, వాటిని తెలుసుకొని సరిదిద్దుకోవటం కంటే గొప్ప లక్షణం మరొకటి లేదు. దీని గురించి గతంలోనే తెలుగురాజ్యం వెబ్ సైట్ ఒక ఆర్టికల్ ను రాసింది. తప్పులు తెలుసుకొని సరిచేసుకుంటూ ముందుకి వెళ్ళేవాడే గొప్పోడు అని, ఆ కోణంలో చూస్తే జగన్ లో మార్పు చాలా మంచిదే అని చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని రాధాకృష్ణ కూడా ఒప్పుకొని జ్యోతిలో క్యారీ చేయటం విశేషం.