Raashi Khannna Sensational Clarity : సౌత్ సినిమా కాంట్రవర్సీ పై హీరోయిన్ రాశీ ఖన్నా సంచలన పోస్ట్.!

Raashi Khannna Sensational Clarity

Raashi Khannna Sensational Clarity :  గత కొన్ని రోజులు కితమే స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్ రాశి ఖన్నా తెలుగు సినిమా కోసం గాని అలాగే సౌత్ ఇండియా సినిమా పట్ల పలు షాకింగ్ కామెంట్స్ చేసి సంచలనం రేపింది. ఎప్పుడు అయితే తెలుగు సినిమా నుంచి మంచి ఫేమ్ తెచ్చుకొని ఇతర ఇండస్ట్రీ లలోకి వెళ్లి కామెంట్స్ చెయ్యడం కొంత మంది హీరోయిన్స్ స్టార్ట్ చేసారో వారి లిస్ట్ లో ఈ యంగ్ హీరోయిన్ కూడా చేరింది.

తెలుగు మరియు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ తో ఒక వెబ్ సిరీస్ ని చేసింది. అయితే ఆ సిరీస్ తర్వాత అక్కడి మీడియా దగ్గర సౌత్ ఇండియా సినిమాని తక్కువ చేసి మాట్లాడ్డం చాలా చులకనగా కామెంట్స్ చెయ్యడం ఒక్కసారిగా ఆమెపై నెగిటివిటీ తీసుకొచ్చాయి.

మరి దీనితో ఈ విషయం ఆమె వరకు వెళ్లినట్టు ఉంది. దీనితో సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. తనపై తాను ఇలా అన్నట్టు కొన్ని వార్తలు వినిపించాయని దయచేసి ఆ వార్తలు ఆపండి నాకు అన్ని భాషల సినిమాలు నేను చేసిన భాషలు అంటే గౌరవం ఉంది అని నామమాత్రంగా ఒక పోస్ట్ పెట్టి కామెంట్స్ ఆఫ్ చేసేసింది.

అయితే ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తాను ఎక్కడా ఆ కామెంట్స్ చెయ్యలేదు అది అబద్దం అని మాత్రం చెప్పలేదు. అంటే ఈ లెక్కన అందరికీ మరింత క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. దీనితో ఈ పోస్ట్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క అయితే ఈమెని తెలుగులో బ్లాక్ లిస్ట్ లో పెట్టారని కూడా టాక్ నడుస్తుంది.

https://twitter.com/RaashiiKhanna_/status/1511615813047914503?s=20&t=J–O6NGoFS8qyZ4KyIm_2g