Star Heroine : అలాంటి యంగ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఐరన్ లెగ్ అయ్యిపోయిందా.!

Star Heroine : చాలా మంది ఏమైనా అనుకోవచ్చు కానీ మన దేశపు ప్రజలు సెంటిమెంట్స్ ని బాగా నమ్ముతారన్న మాట వాస్తవం. అయితే ఇది ఒకింత మన సినీ ఇండస్ట్రీ లో కూడా ఎక్కువే అని చెప్పాలి. మరి ఇది సినిమాల టైటిల్ నుంచి వాటిలో ఉండే అక్షరాల నుంచి సినిమా హీరోయిన్స్ వరకూ కూడా ఉంటుందని చెప్పాలి.

ఇప్పుడు అలాంటి అంశమే మళ్ళీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. తన కెరీర్ లో ఎన్నో భారీ హిట్స్ అందుకున్న ఒక స్టార్ హీరోయిన్ పై ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర పడి అది చాలా ఎక్కువ స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. మరి ఆ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నేటి తరం మహానటి కీర్తి సురేష్.

తన కెరీర్ మొదలు పెట్టినప్పుడే కీర్తి సురేష్ మంచి విజయాలు అందుకొని మహానటి సినిమా చేసిన తర్వాత ఓవర్ నైట్ ఇండస్ట్రీ లో బిగ్ స్టార్ అయ్యిపోయింది. ఇక అక్కడ నుంచి మరిన్ని పెద్ద ఆఫర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ కూడా బిజీగానే ఉంది.

కానీ ఇప్పుడు ఈమె ట్రాక్ రికార్డ్ పరిశీలించినట్టు అయితే బ్యాక్ టు బ్యాక్ ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా ప్లాప్ గానే నిలవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఆమె గత ఏడాది చేసిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ లే..

నితిన్ తో “రంగ్ దే” నుంచి రజినీతో “పెద్దన్న” లేటెస్ట్ మరో భారీ సినిమా “మరక్కార్” ఇలా చాలా సినిమాలే ప్లాప్ అయ్యి కూర్చున్నాయి. దీనితో ఇప్పుడు అలాంటి స్టార్ హీరోయిన్ ని ఐరన్ లెగ్ అని ఇండస్ట్రీలో ముద్ర వేసేస్తున్నారు. మరి వీటికి బ్రేక్ ఇస్తూ.. కీర్తి మంచి హిట్ అందుకుంటుందో చూడాలి.