బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాల్లోకొచ్చింది బొద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. మొదట్లో బొద్దుగా వుండేదిగానీ, ఇప్పుడు బాగా బక్కచిక్కిపోయింది. ప్రస్తుతం ‘మంచిరోజులొచ్చాయ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న మెహ్రీన్, ఈ సినిమాపై చాలా అంచనాలే పెట్టుకుంది.
‘ఎఫ్3’ సినిమాపైనా మెహ్రీన్‌కి భారీ అంచనాలే వున్నాయి. తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లోనూ సినిమాలు కమిట్ అయ్యింది. తమిళంలో అయితే మెహ్రీన్ గతంలోనే కొన్ని సినిమాలకు సైన్ చేయగా, వాటిల్లో కొన్ని అటకెక్కాయి.
బాలీవుడ్ సినిమాల సంగతేంటి.? అనడిగితే, ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మెహ్రీన్. పూర్తిగా ప్రస్తుతం సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టాననీ, తెలుగులో మాట్లాడగలుగుతున్న తాను, కన్నడ అలాగే తమిళం కూడా నేర్చుకుంటున్నట్లు చెప్పింది.
ఆ మధ్య ఎంగేజ్‌మెంట్.. ఆ తర్వాత విషయం పెళ్ళిదాకా వెళ్ళినా, పెళ్ళికి కొద్ది రోజుల ముందు మెహ్రీన్ పునరాలోచనలో పడింది. పెళ్ళి ఆలోచనల్ని పక్కన పెట్టేసి, పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టేసిన మెహ్రీన్.. పనిలో పనిగా గ్లామర్ డోస్ కూడా పెంచేయడం గమనార్హం.