మన సౌత్ ఇండియన్ సినిమాలో లో టాలీవుడ్ నుంచి ఇప్పుడు ఎలా అయితే యంగ్ టాలెంటడ్ భవిష్యత్తుపై మంచి హామీ ఇస్తుందో అలానే టాలీవుడ్ తర్వాత ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఇచ్చేలా కనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్” తో కన్నడ సినిమాకి మంచి స్టాండర్డ్స్ సెట్ చెయ్యగా ఆ సినిమాలకు తెలుగు ఆడియెన్స్ కూడా ముఖ్యంగా మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని ఓ చిన్న సినిమా సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి అర్ధం అవుతుంది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ శ్రీని, అదితి ప్రభుదేవా నటించిన చిత్రం “ఓల్డ్ మాంక్”. ముఖ్యంగా చైనీస్ మూవీస్ లో ఈ మాంక్ అనే పదాలు ఎక్కువగా వింటాం. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గిచ్చి గిలి గిలి అనే సాంగ్ కి కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడం భవిష్యత్తులో సౌత్ ఇండియన్ సినిమాపై హోప్ ఇస్తుంది.
కంప్లీట్ గా తెలుగు వాళ్ళకి కొత్త అయినా ఈ సాంగ్ కి మన దగ్గర రెండు రోజుల్లో రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ అందుకోవడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని శ్రీని దర్శకత్వం వహించగా సౌరవ్ వైభవ్ లు సంగీతం అందించారు. మొత్తానికి మాత్రం భవిష్యత్తులో ఇండియన్ సినిమాని ఏలేది దక్షిణాది సినిమాలే అని మరోసారి ప్రూవ్ అయ్యింది అని చెప్పాలి.