ఇన్సైడ్ టాక్ :  సౌత్ లో ఎంఎస్ ధోని ఈ స్టార్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట!

India national cricket team

ఇండియన్ క్రికెట్ దగ్గర అయితే భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే ఇప్పుడు ఎం ఎస్ క్రికెట్ నుంచి దూరం అయ్యాడు. ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ఏ క్రికెట్ ఫార్మాట్స్ లో కూడా తాను లేడు. మరి ఇది కాకుండా ధోని ఇతర పనులు చాలానే ఉన్నాయి కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అయితే సినిమాల్లో నిర్మాతగా తాను రంగంలోకి దిగడం ఖాయం అయ్యింది.

“ధోని ఎంటర్టైన్మెంట్” అంటూ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ కంపెనీ లో తాను ఎలాంటి సినిమాలు ఎవరితో చేస్తాడు అనే అంశాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. మరి ఈ డీటెయిల్స్ చూసినట్టు అయితే ధోని మొదటగా మన సౌత్ ఇండియా స్టార్ నటులు తోనే సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడట.

అందులో భాగంగా తమిళ్ లో స్టార్ హీరో విజయ్, కన్నడ నుంచి కిచ్చా సుదీప్ మరి ఫైనల్ గా మన తెలుగు నుంచి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్స్ తో తన బ్యానర్ లో సినిమాలు లాక్ చేసే పనిలో ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గాని నిజం అయితే ఫ్యాన్స్ కి పెద్ద పండగలే అని చెప్పాలి.