సినీ నిర్మాత, వైకాపా నేత పీవీపీ బుధవారం బంజారాహిల్స్ లోని తన ఇంటి వద్ద చేసిన హంగమా గురించి తెలిసిందే. పీవీపీ ఇంటి పక్కనే ఉంటోన్న కైలాష్ అనే వ్యక్తి తన ఇంటి విస్తరణ పనులు చేపడుతోన్న నేపథ్యంలో పీవీపీ అడ్డు తగిలి వాగ్వివాదానికి దిగడం..40 మంది గుండాలచే కైలాష్ ని బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పీవీపీని బంజారా హిల్స్ పోలీస్టేషన్ కు తరలించారు. పీవీపీ 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులిచ్చారు. ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ కు రావాల్సిం ది గా చెప్పారు.
తాజాగా ఈ వివాదంపై పీవీపీ ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. `తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆతప్పు లక్షల సార్లు అయినా చేయవచ్చు. అలాంటప్పుడు నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న అంటూ పోస్ట్ చేసారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. పీవీపీ పోస్టును బట్టి ఆ వివాదం చాలా కాలంగా కైలాష్-పవీవీ మద్య నలుగుతు న్నట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య గతంలో ఇదే విషయమై చర్చలు జరిగినా ఫలించలేదని పీవీపీ సన్నిహితుల నుంచి తెలిసింది. కైలాష్ కూడా గతంలో ఇలాంటి చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. అయితే నిన్నటి సన్నివేశంతో పీవీపీ కాస్త ఎక్కువగా రియాక్ట్ అవ్వడంతో కైలాస్ అతన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పీవీపీ పలు సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే డిస్ర్టిబ్యూషన్ రంగంలోనూ పీవీపీ రాణిస్తున్నారు. సౌత్ లో డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడం పీవీపీ ప్రత్యేకత. పీవీపీ ఎంట్రీతో న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఘాజీ లాంటి సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ సినిమా తెలుగులో వచ్చిందంటే పీవీపీ వలనే. ఆ సినిమాతో సంకల్ప్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎవరు సినిమాతో వెంకట్ రాంజీ అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేసారు. అటు కోలీవుడ్ లోనూ కొత్త కుర్రాళ్లను ప్రోత్సహించడం పీవీపీ కే చెల్లింది.
తప్పు ని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు 👍
నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న 🙏— PVP (Modi Ka Parivar) (@PrasadVPotluri) June 25, 2020