Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు నిర్మాణంలో నిర్మించారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రెస్ మీట్ లో హీరో మంచి విష్ణుని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. న్యూజిలాండ్‌లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించగా మంచు విష్ణు స్పందిస్తూ.. నీకు ఒక వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు.
అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. 7000 వేల ఎకరాలు అన్నది మోహన్ బాబు జోక్ గా అన్నారని అర్థమవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన కన్నప్ప సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.