రష్యాలో విడుదల కానున్న పుష్ప … ప్రమోషన్ల కోసం రష్యా పయణమవుతున్న బన్నీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ కుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా విడుదలైన విషయం తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకొనుంది.

ఇకపోతే పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి విషయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని తిరిగి రష్యాలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇదివరకే రష్యాలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా విడుదలైన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే RRR సినిమా బాటలోనే పుష్ప సినిమా కూడా రష్యాలో విడుదల కావడానికి సిద్ధమైంది.

పుష్ప సినిమాని రష్యాలో డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన తెలియజేయునన్నారు.ఈ సినిమా రష్యాలో విడుదల కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం రష్యా వెళ్తున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా రష్యాలో ఏ విధమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది, రష్యాలో పుష్ప సినిమా RRR రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.