ఆ స్టార్ హీరో తో పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా

టాలీవుడ్ లో హీరోస్ ని ఎలేవేట్ చెయ్యడమో లో పూరి జగన్నాధ్ స్టైల్ వేరు. ఒకప్పుడు పూరి తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని చాలా మంది స్టార్ హీరోలు వెనకపడ్డ సందర్భాలు ఉన్నాయి. ‘భద్రి’, ‘ఇడియట్’, ‘పోకిరి’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ చాన్నాళ్ల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

‘టెంపర్’ తర్వాత చాలా రోజులకి ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ అందుకున్నాడు, చాలా అంచనాల మధ్య వచ్చిన ‘లైగర్’ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ తో తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ ఆగిపోయింది.

అస్సలే ప్లాప్ ల తో ఉన్న పూరి కి ఏ హీరో ఛాన్స్ ఇవ్వదు అనుకున్న టైం లో ఒక స్టార్ హీరో పూరి తో సినిమా చెయ్యడానికి బాలకృష్ణ ఒకే చెప్పాడని తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో అనిల్ రావిపూడి సినిమాని కూడా బాలయ్య స్టార్ట్ చేసేలా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయిన తర్వాత పూరి తో బాలకృష్ణ సినిమా ఉండొచ్చు.