పబ్ జీ కార్పొరేషన్ ఇటీవల ఇండియాలో ఒక ప్రకటన విడుదల చేసింది . ఇది భారతదేశంలో పబ్ జి ఫాన్స్ కి గొప్ప శుభవార్తనే , ఎందుకంటే పబ్ జీ ప్లేయర్స్ కి బాన్ అయినప్పటి నుండి తీవ్ర నిరాశలో ఉన్నారు. పబ్ జీ మొబైల్ ఇండియా పేరిట తాము దీన్ని లాంచ్ చేస్తున్నట్టు ఈ కొత్త వెర్షన్ కి ఇదే పేరు పెట్టినట్టు వెల్లడించింది. ఇటీవల దేశంలో పబ్ జీని నిషేధించిన తెలిసిందే. కానీ ఈ నూతన వెర్షన్ ఇండియన్ యూజర్స్ కి ఉద్దేశించి డిజైన్ చేసిందేనని ఈ సంస్ట తెలియజేసింది. ఈ గేమ్స్ లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ పూర్తి డ్రెస్ లోనే ఉంటాయని ప్రకటించింది. ఇండియాలో 100 మిలియన్ డాలర్లు అంటే రూ.746 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది.
కాగా అధికారికంగా ఏ తేదీన లాంచ్ చేస్తామన్నది త్వరలో ప్రకటిస్తామని పబ్ జీ కార్పొరేషన్ ప్రకటించింది. అలాగే ఇండియాలో నిరుద్యోగ సమస్యని కొంతలో కొంతయినా తీర్చేందుకు వివిధ రంగాల్లో ప్రవేశం ఉన్న 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. బిజినెస్ ఎగుమతులు గేమ్ డెవలప్ మెంట్ వంటి వేర్వేరు రంగాల్లో అభినివేశం ఉన్నవారిని ఇది నియమిస్తుందట ‘ప్రమోట్ హెల్దీ గేమ్ ప్లే హాబిట్స్ ఫర్ యంగర్ ప్లేయర్స్’ అన్నదే తమ నినాదమని పబ్ జీ కార్పొరేషన్ పేర్కొంది.
భారతదేశంలో సెప్టెంబర్ 29న పబ్జీ మొబైల్ గేమ్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చైనాతో లింక్స్ ఉండటమే పబ్జీ మొబైల్ నిషేధించడానికి కారణం. పబ్జీ కార్పొరేషన్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. కానీ ఇండియాలో పబ్జీ మొబైల్ కార్యకలాపాలను చైనాకు చెందిన సంస్థ చూసుకునేది. దీంతో చైనా యాప్స్తో పాటు పబ్జీ మొబైల్ని కూడా నిషేధించింది భారత ప్రభుత్వం.