ఈమధ్య కాలంలో కొత్త దర్శకులు కొందరు తెలుగు ప్రేక్షకుల్ని బాగానే మెప్పించారు. కొత్త ఆలోచనలు, కొత్త తరహా మేకింగ్ తో అందరినీ అలరించారు. అలాంటి దర్శకుల్లో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ డైరెక్టర్ వినోద్ అనంతోజు ఒకరు. మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా చూసిన చాలామంది ఈ దర్శకుడు ఎవరో సెన్సిబిలిటీ ఉన్నవాడిలా ఉన్నాడు అంటూ కితాబిచ్చారు. పరిశ్రమలోని చాలామందికి సినిమా నచ్చింది. దీంతో ఆయనకు అవకాశాలు పెరిగాయి.
ప్రస్తుతం ఇతని మీద 30 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు ఒక నిర్మాత. మొదటి సినిమా కేవలం కోటిన్నరలోనే చేసిన ఈయనకు రెండో సినిమాకే 30 కోట్లు పెడుతున్నారంటే గొప్ప విషయమే అనాలి. ఇక ‘జోహార్’ చిత్రంతో మెప్పించిన తేజ మార్ని. రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమా కూడ ఓటీటీలోనే వచ్చింది. ఇది కూడ మంచి ప్రశంసలే అందుకుంది. దీంతో అతని తర్వాతి సినిమా కూడ 25 కోట్ల పైనే ఉంటుందట. ఇలా ఫస్ట్ సినిమాను కోటి కోటిన్నరలో చేసిన యువ దర్శకుల మీద నిర్మాతలు ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తున్నారు.