సినిమా అంటే నిర్మాతలను ముందుగా కంగారుపెట్టేది హీరోగారి డిమాండ్లు. సినిమాలో నటీనటుల నుండి టెక్నికల్ టీమ్ వరకు హీరోగారి ఇష్టానుసారమే జరగాలి. హీరోయిన్ ఎవరనేది హీరోనే తేల్చాలి. ఆయన ఒక పేరును సిఫార్సు చేశాడు అంటే ఎంత బడ్జెట్ అయినా ఆమెను తీసుకురావాల్సిందే. చిన్న చిన్న పాత్రల్లో కూడ పెద్ద కాస్టింగ్ కనబడింది అంటే దాని వెనుక హీరోగారి ప్రాభల్యం ఉందనే అర్థం. ఇక సెట్ వేస్తే అది హీరోకి నచ్చి తీరాలి. పాట తీస్తే హీరో ఫైనల్ అప్రూవల్ ఇవ్వాలి. ఒక్కోసారి ఎవరికి ఎంత రెమ్యునరేషన్ అనేది కూడ ఫిక్స్ చేసేస్తుంటాడు హీరో. ఇలా హీరోతో చాలా చిక్కులే ఉంటాయి. పెద్ద హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడ ఇలాగే నిర్మాత నెత్తిన కూర్చుంటుంటారు.
హీరోగారి ఒత్తిడితో నిర్మాతకు అనుకున్న బడ్జెట్లో కనీసం 10 శాతం వరకు పెరిగిపోతోంది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగట్లేదు. పవన్ తన పాత్ర, తన నటన మినహా మూడవ సంగతి పట్టించుకోవట్లేదట. హీరోయిన్ సహా కథలోని ముఖ్యమైన పాత్రల్లో ఎవరిని తీసుకోవాలి, టెక్నీషియన్లు ఎవరుండాలి, ఇతర సౌకర్యాల సంగేతేమిటి, ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్లు ఇస్తున్నారు, సెట్ ఖరీదుగా ఉందా లేదా లాంటి విషయాల్ని కన్నెత్తి కూడ చూడట్లేదట. కథ, పారితోషకం నచ్చితే సైన్ చేయడం, సెట్లోకి వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్లిపోవడం అంతేనట. దీంతో పవన్ నిర్మాతలు చాలా రిలాక్స్డ్ గా ఉంటున్నారట.