Prabhas: టాలీవుడ్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చేతినిండా అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ఎక్కువ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజాసాబ్ సినిమా కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పట్నుంచో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
హారర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఇటీవల టాలీవుడ్ సమ్మె వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఫిలిం ఫెడరేషన్ యూనియన్స్ ని షూటింగ్ కి వెళ్ళవద్దని సడెన్ గా ఎలాంటి నోటీసులు లేకుండా సమ్మె చేసి అనేకమంది నిర్మాతలకు నష్టం కలిగించారని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్స్ కి రాకుండా తనకు నష్టం కలిగేలా చేశారని పలు యూనియన్స్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు.
దీన్ని యూనియన్స్ వ్యతిరేకించారు. కాగా సమ్మె పూర్తయి, షూటింగ్స్ మొదలయినా విశ్వప్రసాద్ సినిమా షూటింగ్ కి వెళ్ళమంటున్నారట. సమ్మె ఆపేస్తే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటాం అని నిర్మాత చెప్పారు. అయినా కొన్ని యూనియన్స్ మాత్రం విశ్వప్రసాద్ సినిమాల షూటింగ్స్ కి వెళ్లొద్దు అనుకుంటున్నారట. ఈ క్రమంలో రాజాసాబ్ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఇలాంటి సమయంలో సినిమా వర్కర్స్ రాకపోతే షూటింగ్ కి కష్టమే. దీంతో రాజాసాబ్ మరింత ఆలస్యం అవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా జరగాల్సి ఉందట. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.
Prabhas: ప్రభాస్ మూవీకు తప్పని ఇబ్బందులు.. షూటింగ్ పూర్తి కాలేదా.. సంక్రాంతికి కూడా డౌటేనా?
