Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో డార్లింగ్ ప్రభాస్ పేరు కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా డార్లింగ్ ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా సినిమాలకు సంబంధించిన విషయాలలో ప్రభాస్ పేరు మారుమగుతోంది. దాదాపు అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరికలేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఇలా ఎన్ని సినిమాలు నటిస్తుండడంతో తరచూ ఏదో ఒక సినిమా విషయంలో ప్రభాస్ పేరు వినిపిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిపిందే. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరిలో డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్లో నిర్మాత ఎస్‌కేఎన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
A REBEL vibe. A DARLING presence.
Straight from the world of #TheRajaSaab ❤️🔥#Prabhas @SknOnline pic.twitter.com/CdqjbZBkRT— The RajaSaab (@rajasaabmovie) July 10, 2025
బర్త్‌డే సందర్భంగా ఆయనకు ప్రభాస్ విషెస్ తెలియజేశారు. ఆ సమయంలో ప్రభాస్‌తో ఎస్‌కేఎన్ ఒక ఫోటో దిగారు. తాజాగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఇందులో డార్లింగ్ లుక్ వావ్ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రభాస్ అలాంటి లుక్ లో కనిపించే చాలా రోజులు అయింది అని చెప్పాలి. సరికొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఒకప్పటి డార్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
