ఆ విషయంలో కుండ బద్దలుకొట్టేసిన ఛార్మి: ఏంటా విషయం.?

 

Producer Charmy | Telugu Rajyam

చాలా చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి, హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అందాల భామ ఛార్మి. యంగ్ హీరోలూ, స్టార్ హీరోలూ అనే తేడా లేకుండా, టాలీవుడ్ హీరోలందరి సరసనా నటించేసింది అప్పట్లో ఛార్మి. ఎందుకో ఏమో తెలీదు. కానీ, హీరోయిన్‌గా కెరీర్ దూకుడు మీదున్నటైమ్‌లోనే నటనకు గుడ్‌బై చెప్పేసి, నిర్మాతగా సెటిలైపోయింది.

కానీ, ఛార్మికి ఇంకా అవకాశాలొస్తున్నాయట. అయితే, అది హీరోయిన్‌గానా.? లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగానా.? అనే డైలమా అభిమానుల్లో ఉండక మానదు. కానీ, అనుష్క, తదితర హీరోయిన్లతో పోల్చితే, వయసు, గ్లామర్ పరంగా ఛార్మి ముందు వరుసలోనే ఉంటుంది. స్టార్ హీరోలూ, సీనియర్ హీరోల సరసన ఇప్పుడున్న హీరోయిన్లతో పోల్చితే, ఛార్మి ఏం తక్కువ కాదు. గట్టి పోటీనే కాగలదు.

కానీ, తాను ఇకపై నటించే అవకాశం లేదనీ, నిర్మాతగానే పలు మంచి సినిమాలను తెరకెక్కిస్తాననీ, నటన పట్ల తనకు ఇక ఆసక్తి లేదనీ తేల్చేసింది. గ్లామర్‌ ఉన్నా, ఎందుకో మరి ఛార్మి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles