జగన్ సొంత జిల్లాలోనే పత్తాలేని వైసీపీ ఎమ్మెల్యే

కడప… సీఎం జగన్ సొంత జిల్లా… జిల్లాలోని పొద్దుటూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెల్చిన రాచమల్లు ప్రసాద్  రెడ్డి ఇప్పుడు మౌనముద్ర దాల్చారు. గత ఏడాది నుంచి ఏ విషయం పట్టించుకోవడం లేదు. వరసుగా రెండు సార్లు  ఎమ్మెల్యేగా గెల్చిన ఆయన గతంలో చూపించిన దూకుడును పూర్తిగా మానుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా హడావిడి చేసిన ఈనేత ఇప్పుడు ఎంతకీ మౌనం వీడడం లేదు. ఏడాదిగా ఇదే తీరు. తన మార్కు పని తననాన్ని పక్కన పెట్టి ఏదో అలా కాలం గడిపేస్తున్నారు.

రాచమల్లు ప్రసాద్ రెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టడమే ఇందుకు కారణమని టాక్. వచ్చే ఎన్నికల్లో తనకు పార్టీ టిక్కెట్ ఎలాగు దక్కదని డిసైడ్ అయిన పోయిన రాచమల్లు అనవసరంగా లేని పోని రిస్క్ తీసుకోవడం ఎందుకని పూర్తిగా సైలెంట్ అయ్యారంట. సీఎం జగన్ వరదరాజుల రెడ్డి వైపు మొగ్గు చూపిస్తున్నారంట. ప్రొద్దుటూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న వరదరాజులరెడ్డి ఎప్పుడైనా వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చంట. ఈ మేరకు మాటామంతి కూడా పూర్తి అయిపోయిందంట. వైఎస్ఆర్ కు సన్నిహితుడైన వరదరాజులరెడ్డి రావడం ఖాయమని తేలిపోవడంతో రాచమల్లు చల్లబడ్డారంట.

మరోవైపు ఈ పరిణామం పొద్దుటూరు వైసీపీలో ఆధిపత్య పోరుకు కారణమైంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి కార్యకర్తలను దూరం పెట్టి బావమరిది బంగారురెడ్డికే ప్రయారిటీ ఇస్తున్నారంట. ఇప్పటి నుంచే బంధువర్గాన్ని, సన్నిహితులను పోగు చేసుకుంటున్నారంట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనంత మంది బంధువులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారంట. ఈ పరిణామం వైసీపీ కార్యకర్తల్లో వర్గపోరుకు కారణమవుతోందంట. ప్రతిపక్షం అంటూ లేని చోట్ల వైసీపీకి సొంతపార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్న నియోజకవర్గాల జాబితాలో పొద్దుటూరు కూడా చేరిపోయింది.