Priyanka Jain: ప్రియాంక జైన్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.
ఇక ప్రియాంక మౌనరాగం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ లో నటుడు శివకుమార్ కూడా నటించారు. అయితే ఈ సీరియల్ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల ఓకే ఇంట్లోనే కలిసి ఉన్నారని తెలుస్తోంది.. అయితే గత కొంతకాలంగా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
గత కొంతకాలంగా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురైన సరైన సమాధానం మాత్రం తెలియచేయలేదు తాజాగా కిసిక్ టాక్ షోలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి యాంకర్ వర్ష ప్రశ్నించడంతో ప్రియాంక పెళ్లి గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఏడాదిలోనే నేను శివ్ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఈమె తెలిపారు.మా పెళ్లి మాత్రం మామూలుగా ఉండదని….తగ్గేదేలే అంటూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల కాలంలో ప్రియాంక పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కనిపించడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి అయితే తనపై వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ గురించి ప్రియాంక జైన్ స్పందించారు. ఆ ట్రోల్స్ తనను బాధపెట్టాయని, కామెంట్స్ చూసి అసహ్యం వేసిందని అన్నది. అలాంటి డ్రెస్‌లు షోలలో మాత్రమే వేసుకుంటామని, మాల్స్‌లలో వేసుకొని తిరగమని అన్నది. తాము మనుషులమేనని, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.