Priyanka: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మౌనరాగం సీరియల్ లో మూగ అమ్మాయిగా నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తన కళ్ళతోనే హావ భావాలను పలికిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అదే క్రేజీతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
బిగ్బాస్ హౌస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే మౌనరాగం సీరియల్ హీరో శివకుమార్ తో ప్రేమలో పడింది. 2018లో ఈ మౌనరాగం సీరియల్ ప్రారంభం కాగా ఇప్పటికీ కలిసి ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలలో కనిపిస్తోంది. తాజాగా ప్రియాంక తన 27వ బర్త్‌డే ను సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మీరే కారణం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే.
మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నేను పోషించిన ప్రతి పాత్రకు, తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం. నా ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఒక ఫోటో తన కాలి చెప్పుపై బర్త్‌డే కేక్ ను పెట్టింది. తర్వాత అదే కేక్ ను ఆరగించింది. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల సైతం ఆమెపై మండిపడుతున్నారు. తినే తిండిని ఎవరైనా కాళ్లపై పెట్టుకుని అలా చేస్తారా, బయట అదే తిండి దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం తిండిని ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకొని చేస్తున్నారు. తిండితో ఆటలు వద్దు అంటూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై ప్రియాంక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.