Priyadarshi: ప్రియ దర్శి ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన రామ్ జగదీష్ దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కోర్ట్. ఈ సినిమా ద్వారా మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తూ హీరో ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను బలగం సినిమా కంటే ముందుగానే గేమ్ చేంజర్ సినిమాకు కమిట్ అయ్యాను అయితే ఆ సమయంలో నేను ఇంకా హీరో ఫ్రెండ్ పాత్రలలోనే నటించే వాడినని తెలిపారు.
ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ స్నేహితుడు పాత్రలో ఒక సన్నివేశంలో మాత్రమే తాను కనిపిస్తాను అయితే ఈ సినిమా కోసం తాను 25 కాల్ షీట్లు ఇచ్చానని, 25 రోజులు పాటు ఈ సినిమా కోసం కష్టపడితే నా సీన్లన్నీ లేపేసి కేవలం రెండు నిమిషాలు కూడా లేకుండా చేశారని ప్రియదర్శి తెలిపారు.
ఇకపోతే నాకు రామ్ చరణ్ తోను అలాగే శంకర్ గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉండేది. వ్యక్తిగతంగా నాతో శంకర్ గారు సినిమా చేయకపోయినా ఇలా ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఇక చిరంజీవి గారితో కలిసి ఒక సినిమాలో అయినా కనిపించాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదని తెలిపారు.
చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాలో నాకు ఒక పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు కానీ తర్వాత స్క్రిప్ట్ మార్చడంతో అందులో నా పాత్రను తీసేయటం వల్ల ఆ సినిమాలో నటించలేకపోయాను అని ప్రియదర్శి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
