టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియా ఆనంద్..

గతంలో విడుదలైన రానా ‘లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి అభిమానం సొంతం చేసుకుంది. మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉండటం వల్ల టాలీవుడ్ కి దూరమైంది.

కాగా త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా.. ఇందులో ప్రియా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇక ఇందులో సుశాంత్ హీరోగా నటించగా ఈ సిరీస్ జులై 15 నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రియా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.