Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ గురించి తన సహనటుడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి సలార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.
తనకు సలార్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ పరిచయమయ్యారని తెలిపారు. ఈ కొంత పరిచయంలోనే మేమిద్దరం చాలా మంచి స్నేహితులుగా మారిపోయామని వెల్లడించారు. ఇప్పటివరకు నా జీవితంలో ప్రభాస్ లాంటి వ్యక్తిని తాను ఎక్కడ చూడలేదని పృథ్విరాజ్ తెలిపారు. నిజానికి ప్రభాస్ కి ఉన్నటువంటి స్టార్డం తనకు తెలియదని తెలిపారు . అలాంటి ఒక పెద్ద హీరో చాలా సింపుల్ గా జీవితం గడపడానికి ఇష్టపడతారని అలా ఉండటం చాలా గ్రేట్ అంటూ కొనియాడారు.
ప్రభాస్ సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటారు అలాగే తన ఫామ్ హౌస్ లో అత్యంత సన్నిహితులతో ఎంతో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతారని పృథ్విరాజ్ తెలిపారు. ఇక ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పెద్దగా పోస్టులు కూడా చేయరు ఏదో సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే ప్రస్తావిస్తారు. అయితే ఆ పోస్టులు కూడా ప్రభాస్ చేయరు అంటూ తాజాగా పృథ్విరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ఒక స్టార్ హీరో అయినప్పటికీ అలా జీవించరని ఒక సాధారణ వ్యక్తి లాగా ప్రవేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అంటూ ఈయన తెలిపారు. ఇక ప్రభాస్ పెద్దగా బయట వేడుకలకు కూడా ఎక్కడా కనిపించరు అలాగే వివాదాలకు కూడా ఈయన పూర్తిగా దూరంగా ఉంటారని సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ పెద్ద స్టార్ అయి ఉన్నప్పటికీ మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్లి మనం ఎంజాయ్ చేద్దాం అంటూ నన్ను అడుగుతూ ఉంటారు. ఒక స్టార్ హీరో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కోరుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని పృథ్వీరాజ్ వెల్లడించారు.