ప్రధాని మోడీ రాక.. పీఎంఓ నుండి కేసీఆర్ కు ఊహించని షాక్

kcr modi

 సాధారణంగా దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు, ఎలాంటి రాజకీయ పరమైన తారతమ్యాలు చూపించకుండా ప్రధాని మంత్రికి స్వాగతం పలకావటం ప్రోటోకాల్ లో ఒక భాగమని అందరికి తెలుసు, కానీ తాజాగా తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ కు అవకాశం రాలేదు. వినటానికి ఇది కొత్తగా ఉన్నకాని అదే నిజం. ఈ విషయాన్నీ స్వయంగా తెరాస వర్గాలే చెప్పటం జరిగింది.

pm modi cm kcr

 భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై సమీక్షకు మోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే! ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాన మంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్లినపుడు విమానాశ్రయం వద్ద్ద గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈసారీ అలాగే చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు సమాచారం ఇచ్చిందని వివరించారు.

 అయితే, మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చిందని ఇందులో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామొహంతి, సైబరాబాద్‌ సీపీ వీసీ సీజ్జనార్‌, హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండెంట్ కు మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు కాబట్టి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

ఒక దేశ ప్రధాని పర్యటనకు వస్తుంటే ఆ కార్యక్రమంలో సీఎంకు అవకాశం లేదని, రావాల్సిన పని లేదని ఈ విధంగా ఫోన్ రావటం ఇదే మొదటిసారి అని, గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ఆనవాలు లేవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మరియు తెరాస వర్గాలు అంటున్నాయి. కరోనా ప్రభావం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా..? లేక గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది మాత్రం తెలియరాలేదు