Cookin Oil: ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను బాగా వణికిస్తున్నాయి. కేవలం ఒక్క వస్తువే కాకుండా కూరగాయల నుంచి ప్రతి ఒక్క ధర పెరిగిపోయింది. ఇక సామాన్య ప్రజలు ధరలు పెరగటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది సామాన్య ప్రజల్లో మరో అలజడి ఎదురయ్యింది. తాజాగా మళ్లీ వంట నూనె ధరలు పెరిగి షాక్ ఇస్తున్నాయి.
గత నెల లీటర్ సన్ ఫ్లవర్ వంట నూనె ధర రూ. 120 నుండి రూ.130 పెరగగా.. తాజాగా వంద రూపాయలు పెరిగి ఏకంగా 225 వరకు చేరుకుంది. ఇక హోల్సేల్ మార్కెట్ లలో ఎప్పటికప్పుడు కొత్త ఎమ్మార్పీ ధరల స్టిక్కర్లతో అమ్ముతున్నారు. ఇక 190 లో ఉన్న ఇతర బ్రాండ్ల నూనెల ధరలు ఇప్పుడు రూ.220 చేరుకున్నాయి. పామ్ ఆయిల్ ధర కూడా రూ.20 పెరిగింది.