Petrol Price: ఇప్పటికే సామాన్య ప్రజలు నిత్యావసరాల ధరల పెంపుదలతో సతమతమవుతున్నారు. వంట నూనె నుంచి గ్యాస్ సిలిండర్ వరకు ప్రతి ధరలు పెరగటంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు కూడా చేపడుతున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు లేదు.
ఇక తాజాగా మళ్లీ పెట్రోల్ ధరలు పెరగటంతో సామాన్యులు వణికిపోతున్నారు. ఇప్పటికే వీటి ధరలతో ఇబ్బందులు పడగా మళ్లీ తాజాగా ధరలు భగ్గుమంటున్నాయి. గురువారం రోజు లీటర్ కు రూ.80 పైసలు పెంచగా.. గత పది రోజుల్లోనే లీటర్ కు రూ.6.40 ధర పెరిగింది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.101.81, డీజిల్ రూ.93.07 కు చేరుకుంది.