Bheemla Nayak: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుందంటే ముందుగానే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ చేసుకోవడం కోసం చాలామంది బుక్ మై షో ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటారు.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కావడంతో ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. అయితే
బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల ఒక్కో టికెట్ కు అదనపు చార్జీలు వసూలు చేస్తారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో టికెట్ బుకింగ్ పై అదనపు చార్జీలు తగ్గించుకోవాలని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ బుక్ మై షో సమస్థను కోరారు.
ఈ క్రమంలోనే బుక్ మై షో ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ధరలు తగ్గించేది లేదని తేల్చి చెప్పింది. ఈక్రమంలోనే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కాకుండా డైరెక్టుగా థియేటర్ లోనే విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో బుక్ మై షో ఒక్కసారిగా కంగుతింది.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే టికెట్స్ ఏ రేంజ్ లో బుక్ అవుతాయో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ సినిమా అవకాశాన్ని వదులుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని భావించిన బుక్ మై షో నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ కు వారు చెప్పిన కండిషన్లకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే 11 శాతం అదనపు చార్జీలను వసూలు చేయకుండా థియేటర్ ను బట్టి ఒక టికెట్ పై 5 లేదా 6 శాతం వరకు తగ్గించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా బుక్ మై షో అదనపు చార్జీలను తగ్గించడంతో వెంటనే ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ బుక్ కావడం విశేషం.