సాధారణ ఒక సినిమా షూటింగ్ చేయాలంటే ఆ సినిమాకు సంబంధించిన ఇంటిని కూడా పెద్ద ఎత్తున సెట్ వేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో భారీ సెట్ లను నిర్మించి సినిమా షూటింగులను చేస్తారు.ఇకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమా ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమా మొత్తం ఒక ఇంటి చుట్టూ తిరుగుతుంది.ఎలాగైనా అల్లు అర్జున్ వారసుడిగా ఆ ఇంటిలోకి అడుగు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆ ఇల్లు కూడా ఎంతో హైలైట్ అయింది.
అచ్చం ఇంద్ర భవనాన్ని తలపిస్తున్నటువంటి ఆ ఇంటి సెట్ రామోజీ ఫిలిం సిటీ లో వేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా షూటింగ్ సెట్లో కాకుండా రియల్ ఇంటిలోనే షూటింగ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నిజమైన ఇంటిలోనే చిత్రీకరణ జరిపారు. అచ్చం ఇంద్ర భవనాన్ని తలపిస్తూ ఉన్నటువంటి ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. మరి ఇలాంటి ఇంద్ర భవనం ఎవరిది ఆ భవనం ఖరీదు ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.
అలా వైకుంఠపురం సినిమాలో ఉన్నటువంటి ఈ ఇంద్ర భవనం ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్తది.ఈ ఇంటి కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎంతో అందంగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని అత్యంత ఖరీదైన భవనాలలో ఈ ఇల్లు ఒకటి ఇలా అన్ని హంగులతో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఇంటిలో అలా వైకుంఠపురం సినిమా షూటింగ్ చేశారు. ఈ ఇల్లు ఖాళీగా ఉండడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అల్లు అర్జున్ ఈ ఇంటిని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.