రాష్ర్టంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాలు చర్యలు ప్రారంభమయ్యాయి. తొలి విడత కింద విశాఖ, గుంటూరు జిల్లాలలో కలిపి 9 చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన భూముల్ని ఈ వేలం ద్వారా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూములు ద్వారా సుమారు 300 కోట్లు వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. నవరత్నాలు, నాడు -నేడు వంటి ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వెచ్చిస్తామని బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ-వెలం ఈనెల 29 జరుగుతుందన్నారు. నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ర్టక్షన్ కార్పోరేషన్ ద్వారా భూముల విక్రయం జరుగుతుందని స్పష్టం చేసారు. త్వరలో జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ భూముల విక్రయాలకు ఆమోదం తెలపనున్నారు. ఈభూములన్ని ఎటుంవంటి వివాదాల్లో గానీ, ఆక్రమణలకు గురైనట్లు గానీ లేవని అధికారులు తెలిపారు. ఈ- వేలంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పాల్గొనవచ్చు అని అన్నారు.
గుంటూరులోని నల్లపాడులో 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ లో 5.44 ఎకరాలు, మెయిన్ జీటీ రోడ్డు లో 1.72 ఎకరాలు భూమి అందుబాటులో ఉంది. ఇక విశాఖలో చినగడ్డిలోని 075 ఎకరాలు, అగనం పూడి రెవెన్యూ ఫరిదిలో 0.50 ఎకరాలు ఏపీ ఇండస్ర్టీయల్ ఇన్ ప్రాస్ర్టక్చర్ కార్పోరేషన్ కు చెందిన 1.04 ఎకరాలు, 1.93 ఎకరాల భూమి విడి విడిగా అమ్మకానికి కలదని అధికారులు తెలిపారు. అటు ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించే ప్రక్రియలో భాగంగా కొన్ని భూముల్ని చదును చేయిస్తోన్న సంగతి తెలిసిందే.