దక్షిణాది స్టార్ దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి తర్వాత అంత డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఇతనే. ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే అన్ని ప్రాజెక్టులను పక్కనబెట్టి ప్రశాంత్ నీల్ ‘సలార్’ కోసం డేట్స్ కేటాయించారు. ‘కెజిఎఫ్ 2’ విడుదలయ్యాక ఈ కన్నడ డైరెక్టర్ క్రేజ్, ఫేమ్ రెట్టింపు కావడం ఖాయం. ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ పారితోషకం విషయంలో మాత్రం చూసి సాదాసీదాగానే ఉంటున్నారు ఆయన.
ఇతర స్టార్ డైరెక్టర్ల మాదిరి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయట్లేదు. రాజమౌళినే తీసుకుంటే ఒక్కొక సినిమాకు 50 కోట్ల వరకు పుచ్చుకుంటున్నారు. సుకుమార్, శంకర్, కొరటాల శివ 15 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తున్నారు. వీరందరి కంటే డిమాండ్లో ఉన్న ప్రశాంత్ నీల్ మాత్రం 10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘సలార్’కు, నెక్స్ట్ ఎన్టీఆర్ చిత్రానికి ఇంతే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే నిర్మాతలు కూడ ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.