కేటీఆర్ తో ప్రశాంత్ భేటీ ; అదిరిపోయే అప్డేట్

ktr pk telugu rajyam

 దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కి మంచి వ్యూహకర్త అనే పేరు ఉంది. ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వున్నా రాజకీయ శక్తులను కూడగట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిషోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది.

Pk Telugu Rajyam

 

 మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో కీలక సభ్యుడైన రాబిన్, చంద్రబాబు నాయుడు తరుపున పనిచేస్తున్నాడు. ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్ తన టీం సభ్యుడైన రిషితో కలిసి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యాడు. ఇందులో ప్రధానంగా జాతీయ రాజకీయాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో తెరాసకి బీజేపీ పక్కలో బల్లెం మాదిరి తయారు అవుతుంది. కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి, ఆ స్థానంలో బీజేపీ వచ్చి చేరుతుంది. దీనితో తెరాస కూడా బీజేపీపై గుర్రగా వుంది. మరోపక్క కేసీఆర్ పై బీజేపీ అధినాయకత్వం కక్ష సాధించే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలోనే కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో మూడోఫ్రంట్ కి నాయకత్వం వహిస్తానని ముందుకి రావటమే కాకుండా బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీల అధినేతలతో కూడా సమావేశం కావటం జరిగింది.

ktr pk telugu rajyam

 ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ తాజాగా కేటీఆర్ తో భేటీ అయ్యాడు. బీజేపీ మీద వస్తున్నా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని, వచ్చే ఎన్నికల నాటికీ ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని అందుకోసం ఆచరించవలసిన వ్యూహాల గురించి, అదే విధంగా మిగిలిన పార్టీలతో తాము సాగించిన మంతనాల ఫలితాల గురించి ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్ కేటీఆర్ కి వివరించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో తెరాస పార్టీని కూడా తమతో జతకట్టాలని కూడా ప్రశాంత్ కిషోర్ కేటీఆర్ ను కోరినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ కూడా సానుకూలంగా స్పదించినట్లు సన్నిహిత వర్గాల నుండి తెలుస్తుంది. ఎప్పటినుండో కేసీఆర్ కి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరిక బలంగా ఉంది. రాష్ట్రంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన తీసుకోవటంతో దీనిపై సానుకూలంగానే తెరాస అధినాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.